టీవీకే పార్టీలో చేరిన ప‌ళ‌నిస్వామి మేన‌కోడ‌లు

కండువా క‌ప్పి ఆహ్వానించిన మంత్రులు

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన టీవీకే పార్టీలో చేరేందుకు ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్, ప్ర‌ముఖ విల‌న్, న‌టుడు ఖాన్ తో పాటు అన్నాడీఎంకేలో నెంబర్2 పాత్ర పోషించిన ఎడాపాడి ప‌ళ‌ని స్వామి మేన‌కోడ‌లు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మీనాక్షి తవేకావ్ టీవీకే పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఆమెకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు మంత్రులు. ఈ సంద‌ర్భంగా మీనాక్షి మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం ప్రజా పాల‌న‌ను అందించేందుకు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు.

అందుకే టీవీకే పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఎవరిని మెప్పించాల‌ని తాను పార్టీలోకి రావాల‌ని అనుకోలేద‌ని చెప్పారు. కేవ‌లం ప్ర‌జల‌తో క‌లిసి సత్ సంబంధాల‌ను మ‌రింత పెంపొందించు కోవ‌డంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు మౌనికా . సీఎం విజ‌య్ దేశంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా ప‌నులు చేస్తున్నార‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ ప‌రంగా ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించినా తాను చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు . ఇదిలా ఉండ‌గా అన్నాడీఎంకే పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్ గా ఉన్న ప‌ళ‌నిస్వామి కోడ‌లు అధికార పార్టీలో చేర‌డం క‌ల‌క‌లం రేపింది. చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *