కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

డీకేకు మ‌ద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు

బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే దేశం మొత్తం ప్రభావితం అవుతుందా? ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది పార్టీ కార్యక్రమం అని అన్నారు. పనికిమాలిన వాళ్లారా… ఇక్కడ వ్యక్తుల ఆరాధన ఉండదు, మనందరినీ ఏకం చేసే పార్టీ కార్యక్రమం కోసం మనం ఇక్కడ ఉన్నాం అని మ‌రిచి పోవ‌ద్ద‌ని పేర్కొన్నారు ఖ‌ర్గే. నాకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పారు.

చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చారు; పార్టీకి వారి సహకారం తక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ వారికి ఎంతో మేలు చేసిందని అన్నారు ఏఐసీసీ బాస్. ఇక్కడ నినాదాలు చేస్తున్న వారి దృశ్యాలు రికార్డై ఉంటాయని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ దృశ్యాలను పరిశీలించిన తర్వాత నేను క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాన‌ని మ‌రోసారి మండిప‌డ్డారు. కార్య‌క‌ర్త‌లు తెలుసు కోవాల్సింది ఏమిటంటే పార్టీనే ముఖ్యం, స‌ర్వ‌స్వం. అదే సుప్రీం అని తెలుసు కోవాల‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *