రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

Spread the love

భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి

అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపీ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. నోవోటెల్ వద్ద భద్రత, వసతి ఏర్పాట్లను ప‌రిశీలించారు మంత్రి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి తగిన సూచనలు జారీ చేశారు.

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రథమ పౌరురాలి విశాఖపట్న పర్యటన విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌భుత్వం భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి నివాసం ఉండే చోట ముందు జాగ్ర‌త్త‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు , స్తానికుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండానే సెక్యూరిటీని మ‌రింత క‌ట్టుదిట్టం చేయాల‌ని ఆదేశించామ‌న్నారు.

  • Related Posts

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

    Spread the love

    Spread the loveవ‌ర్షాలు స‌మృద్దిగా పడాల‌ని కోరుకుంటున్నా అమ‌రావ‌తి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *