newsseals.com

అక్టోబ‌ర్ 15న రానున్న ర‌జ‌నీకాంత్ జైల‌ర్ -2

July 4, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు నెల్స‌న్ దిలీప్ కుమార్. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం జైల‌ర్. ఇందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కీల‌క పాత్ర‌లో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో విడుద‌ల చేశాడు. ఈ సినిమా ప్ర‌స్తుత సీఎం విజ‌య్ న‌టించిన లియోను దాటి ఆశ్చ‌ర్య క‌ర‌మైన క‌లెక్ష‌న్స్ సాధించి అత్యంత విజ‌య‌వంత‌మైన సినిమాగా ర‌జ‌నీ కెరీర్ లో నిలిచింది. రికార్డుల మోత మోగించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఏకంగా భారీ బ‌హుమ‌తుల‌ను కూడా ప్ర‌క‌టించింది. జైల‌ర్ బిగ్ స‌క్సెస్ తో సీక్వెల్ గా జైల‌ర్ -2ను ప్లాన్ చేసింది. ఇందులో కూడా ముఖ్య పాత్ర పోషించారు లెజెండ్ న‌టుడు ర‌జ‌నీకాంత్.

ఇక జైల‌ర్ -2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ఫుల్ ఫోక‌స్ పెట్టాడు. ఇదిలా ఉండ‌గా మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వ‌చ్చే అక్టోబ‌ర్ నెల 15వ తేదీన జైల‌ర్ -2ను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా దెబ్బ‌కు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన విశ్వంభ‌ర విడుద‌ల తేదీని 15 కాకుండా 16వ తేదీకి మార్చారు. ఇప్ప‌టికే జైల‌ర్ -2 మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టేకింగ్, మేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చే ద‌ర్శ‌కుడు ఎలా ర‌జ‌నీకాంత్ ను ఎలా చూపించాడ‌నే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ప్రోమో, ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించాడు.

Related News