హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నేరవేరనుంది, తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తనని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దళిత న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ తన ఆనందాన్ని పంచుకున్నారు .ఈసందర్భంగా మాట్లాడుతూ రెండేళ్ల క్రితమే హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగినా కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం రూపు దాల్చలేదు.అయితే నేడు చీఫ్ జస్టిస్ ఇచ్చిన స్పష్టమైన హామితో నవంబర్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవం నాటికి హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాటు మార్గం సుగమం అయింది

ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ కి శాలువా, బోకే బహుకరించి తమ ఆనందాన్ని సాటి న్యాయవాదులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ మాదిగ కన్వీనర్ దున్న అంబేడ్కర్, గౌరవ అధ్యక్షులు ఇనుగాల భీమా రావు, శ్రీలత, పారిజాత,రామకృష్ణ, సుమిత్ర, యాదీశ్వర్ తదితర న్యాయవాదుల బృందం సీజేకి శుభాకాంక్షలు తెలిపారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ ఆప‌రేష్ కుమార్. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం త‌న బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    సమాజ విధ్వంసకులకు జ‌గ‌న్ రెడ్డి అండ‌

    అమ‌రావ‌తి : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశ పూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

    నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు

    నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *