డిసెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు : డీకే

బెంగళూరు: క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ అంటే గ్రేటర్ బెంగళూరు అథారిటీ , గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ , జిల్లా పంచాయతీ స్థాయి ఎన్నికలను డిసెంబర్ నాటికి నిర్వహిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన తన సదాశివనగర్ నివాసంలో మల్లికార్జున ఖర్గేతో సమావేశమై, రాబోయే ఎన్నికలు , మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కారణంగా గడువును పొడిగించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కూడా, డిసెంబర్‌లో ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

అలాగే, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు , మున్సిపల్ కార్పొరేషన్లతో సహా అన్ని స్థానిక సంస్థలకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్య‌మంత్రి తెలిపారు. జాతీయ రాజధానిలో విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక సీఎం ఇలా అన్నారు ఏఐసీసీ కార్యాలయం మాకు దేవాలయం లాంటిది. మేము దీనితోనే ఎదిగామ‌ని అన్నారు. ఆ దేవాలయంలోనే ప్రధాన కార్యదర్శిని కలవడం నా బాధ్యత. ఈ రోజు బెంగళూరు GBA స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఒక కీలక నిర్ణయం వెలువడింది. మేము ఏ సమయంలోనూ వీటిని వాయిదా వేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం.

  • Related Posts

    వృద్దురాలికి సీఎం విజ‌య్ స‌న్ గ్లాసెస్ గిఫ్ట్

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు.తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వృద్ధురాలు చెల్లమ్‌కు ఇవాళ కూడా సాధారణ కష్టమైన పని దినంలాగే మొదలైంది. కానీ మధ్యాహ్న సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి.…

    మంత్రి కొండా సురేఖ తొలగింపు త‌ప్ప‌దా..?

    న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నారా. ఇప్ప‌టికే మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం క‌ల‌క‌ల రేపింది. త‌న స్వంత కూతురు కొండా సుస్మితా ప‌టేల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయ‌న బ్ర‌ద‌ర్స్ పై.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *