newsseals.com

విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు

August 14, 2026 · VijayaBhaskar

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8 MVA PTRను విజయవంతంగా ఛార్జింగ్ చేసి విద్యుత్ సరఫరాలోకి తీసుకు వచ్చారు. పనులను డీఈ ఆప‌రేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. ఈ సామర్థ్య పెంపుతో పెద్దముద్దునూరు , పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత విశ్వసనీయంగా అందుబాటులో ఉంటుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చే అవకాశం లభిస్తుంది.

ఓవర్‌లోడింగ్ సమస్యలు తగ్గి, అంతరాయాలు తగ్గుముఖం పడతాయి. గృహ ,వాణిజ్య వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో, TGSPDCL వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేస్తోందని స్ప‌ష్టం చేశారు టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్.

Related News