newsseals.com

రాజధాని నిర్మాణంలో ఐదు కాన్సెప్టులు : సీఎం

August 14, 2026 · VijayaBhaskar

అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది అని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమే. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది. అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్‌టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నాం. ఐదు ముఖ్యమైన అంశాలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నాం. నో పోల్స్, బ్లూ, గ్రీన్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం డీప్ టెక్ లాంటి ఐదు కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోంది. ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుంది. టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుంది.

అమరావతి, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయి. 190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు. 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సింధూ నాగరికత తరహాలోనే రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయి. ఇక అమరావతి అన్ స్టాపబుల్. రాజధాని లో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దుష్టమైన లక్ష్యాలను పెట్టుకుంటున్నాం”. అని సీఎం అన్నారు.

Related News