newsseals.com

బండి సంజయ్ పై భ‌గ్గుమ‌న్న ఆకునూరి మురళి

August 19, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పై.
మాకు మీ రక్తం వద్దు. మీ దేశ భక్తి మాటలు వద్దు. మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, యువత కు గౌరవ ప్రదమైన జాబ్స్ , అవినీతిలేని ప్రభుత్వాలు కావాలని అన్నారు. మాకు మీకంటే ఎక్కువ టన్నుల కొద్దీ దేశ భక్తి ఉందన్నారు. అది మీకు కనపడదు. విద్య కు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యలేదని మీరు అంటున్నారు . చాలా కరెక్ట్ . మరి మీరెందుకు చెయ్యరు ? దొందూ దొందే. విద్య రాజ్యాంగం లో ఉమ్మడి జాబితా లో ఉంది కదా . రాష్ట్రం నుండి 50 % GST పన్నులు, 100 % income tax పన్నులు, కార్పొరేట్ పన్నులు, యూనియన్ ఎక్సైజ్, కస్టమ్స్ పన్నులు మస్తు మస్తు వసూల్ చేస్తారు. మరి మీరేమి చెయ్యరా విద్యకు రాష్ట్రం లో . సమగ్ర శిక్ష, పీఎంశ్రీ లాంటి నామ్ కే వాస్తే బడ్జెట్ లు ఇచ్చుకుంటూ తప్పించుకుంటారా ? ప్రపంచం లో విద్యకు అతి తక్కువ బడ్జెట్ (2.5 %) ఇస్తున్న దేశం మనదే అంటే మీరే.

అస్సలు మీ భావజాలమే అందరికీ విద్య ఇవ్వడానికి వ్యతిరేకం ఏం మాట్లాడుతావు సారు నువ్వు ? రాష్ట్రం లో కాంగ్రెస్ కూడా అతి తక్కువ బడ్జెట్ ఇచ్చుకుంటూ మీ ఇద్దరి పక్కన చేరింది. మీ మూడు పార్టీలు మోసం చేస్తున్నాయి. విద్య విషయం లో. నాణ్యమైన విద్య సైంటిఫిక్ క్రిటికల్ థింకింగ్ విద్య ఇస్తే మీ అందరికీ భయం కదా ప్రజలు ప్రశ్నిస్తారని, అబద్ధాలు నమ్మరని, జెండాలు మోసె వాళ్ళు దొరకరని, మీకు అగ్గువ ( లేబర్ దొరకరని. తెలుసు బాబు. ప్రజలకు కూడా అర్థం అవుతుంది మెల్లిగా. ఇంకా ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు మోసం చేస్తారు బడా బాబులు అంటూ మండిప‌డ్డారు ఆకునూరి ముర‌ళి.

Related News