newsseals.com

యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం

August 23, 2026 · VijayaBhaskar

హైదరాబాద్: హైద‌రాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై వెంకట్ కె. నారాయణ , యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌ల‌యాళం చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి రచన , దర్శకత్వం వహించారు. కన్నడ , ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు ఈ మూవీని. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం , మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్ప‌టికే టాక్సిక్ చిత్రం ప్ర‌మోష‌న్స్ కొన‌సాగుతున్నాయి దేశ వ్యాప్తంగా. ఈ సినిమాపై భారీ అంచ‌న‌లు నెల‌కొన్నాయి.

Related News