newsseals.com

భారత్ లో అపార‌మైన టాలెంట్ కు కొద‌వ లేదు

August 26, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : భారత దేశంలో వైవిధ్య భరితమైన టాలెంట్ ఉందన్నారు Career Consultz వ్యవస్థాపకుడు, CEO రోహిత్ రావు . ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో భారత ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, స్కిల్డ్, టెక్నికల్ మ్యాన్ పవర్‌లోనూ భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జపాన్‌లో ఉపాధి అవకాశాల కోసం భారతీయ యువతకు జపనీస్ భాష, సంస్కృతి, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. Specified Skilled Worker (SSW) కార్యక్రమం ద్వారా భారతీయ నిపుణులు, నైపుణ్యవంతులైన యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. నాగోయా డిప్యూటీ మేయర్ యసుయో ఫుకియాగే కార్యక్రమంలో పాల్గొని భారత్–జపాన్ మధ్య సహకారం, నైపుణ్య మానవ వనరుల భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జపాన్‌కు చెందిన వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విశ్వ విద్యాలయాల ప్రతినిధులు, భారత–జపాన్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్–జపాన్ (ICCJ) తరఫున పరమ్‌జిత్ చద్దా, ఇషు కల్వాని, కాన్సాయ్ జపాన్–ఇండియా అసోసియేషన్ (KJIA) తరఫున జునిచి నిషిదా, సుసుము సైటో, NICE తరఫున యసుజి కితామురా, FWC-Japan-IHDA ప్రతినిధులు పాల్గొన్నారు. నాగోయా సిటీ, ఒసాకా ప్రిఫెక్చర్‌కు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.

Related News