newsseals.com

బ‌డా బాబుల రుణాల ఎగ‌వేత‌కు మోదీ స‌ర్కార్ చేయూత‌

August 29, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత బడా బాబులు, కార్పొరేట్ టైకూన్ల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా వారు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, బ్యాంకుల‌లో తీసుకున్న రుణాల‌ను కావాల‌ని ఎగ‌వేత చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఎక్సెల్ గ్రూప్ , జీ మీడియా సంస్థ‌లకు చెందిన సుభాష్ చంద్రకు భారీ ఊర‌ట ల‌భించేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఆయ‌న జీ సంస్థ‌ను న‌డుపుతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపారు. త‌న మీడియా సంస్థ‌ల ద్వారా విస్తృతంగా ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. ఇందుకు ప్ర‌తిఫలంగా సుభాష్ చంద్ర‌కు మేలు చేకూర్చేందుకు రాజ్య‌స‌భ సీటు కూడా ఇచ్చింది. కానీ ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

ఇదిలా ఉండ‌గా అనిల్ అంబానీకి చెందిన రూ. 47,000 కోట్ల రుణాన్ని NCLT కేవలం రూ. 455 కోట్లతో పరిష్కరించింది. తాజాగా రూ. 22,000 కోట్ల రుణాన్ని పరిష్కరించు కోవడానికి జీ మీడియా సంస్థ ల చైర్మ‌న్ సుభాష్ చంద్రకు కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించాల‌ని ఆదేశించింది.బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 35,700 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది; ఇవన్నీ రూ. 100 కోట్లకు పైబడిన రుణాలు. గతంలో అదానీకి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. ఇది మన దేశంలో జరుగుతున్న అత్యంత వ్యవస్థీకృత దోపిడీ.ఈ ధోరణి గత దశాబ్ద కాలంలో కనిపిస్తోంది. దీనిపై ఇప్ప‌టి దాకా బీజేపీ నుంచి నోరు మెదిపే వారు లేకుండా పోయారు.

Related News