newsseals.com

రేవంత్ రెడ్డి వ‌న్ టైమ్ సీఎం : కొండా సుష్మిత

September 4, 2026 · VijayaBhaskar

వ‌రంగ‌ల్ జిల్లా : త‌న త‌ల్లి కొండా సురేఖ‌ను కావాల‌ని బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కొండా సుస్మితా ప‌టేల్. త‌ను మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాల‌లో అపార‌మైన అనుభవం త‌మ త‌ల్లికి ఉంద‌న్నారు. ఆరు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చ‌రిత్ర కొండా సురేఖ ఫ్యామిలీకి ఉంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాల‌ని అవమానించార‌ని ఆరోపించారు. త‌న‌ను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి కుట్ర‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన బీసీల‌ను అవ‌మానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌న్నారు. కొండా ఫ్యామిలీ అంటేనే ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు.

బీసీల‌ను కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ వ‌చ్చార‌న్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడ లేద‌న్నారు. ఖ‌ర్గే గురించి , రాహుల్ గాంధీ గురించి, ప్రియాంక గాంధీ గురించి , ప్ర‌త్యేకించి పార్టీ గురించి ఒక్క ప‌ల్లెత్తు మాట్లాడ లేద‌న్నారు కొండా సుస్మితా ప‌టేల్. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. తాను మేజ‌ర్ న‌ని, తాను అన్న మాట‌ల‌కు త‌న త‌ల్లిని ఎలా బ‌లి చేస్తారంటూ ప్ర‌శ్నించారు . ఒక ర‌కంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి వన్ టైం ZPTC, వన్ టైం MLC, వన్‌టైమ్ MLA, వన్ టైమ్ MP , వ‌న్ టైమ్ సీఎం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Related News