చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు నటుడు ధనుష్. తన గురించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. ‘బాహుబలి’ రచయిత, భన్సాలీ భారీ నిర్మాణం, ప్రధాన పాత్రలో ధనుష్, హిందీలో అడుగు పెట్టనున్నారు తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్. ప్రముఖ రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్, చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్న రాబోయే చిత్రానికి కథను అందించేందుకు అధికారికంగా ఈ ప్రాజెక్టులో చేరారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయి పౌరాణిక అటవీ సాహసగాథగా రూపొందిస్తున్నారు. ఇందులో నటుడు ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చారిత్రాత్మక బ్లాక్బస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ దీనికి రచన చేయనున్నారు.
అద్భుతమైన దృశ్యాలు, వైభవంతో కూడిన చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ దీనిని నిర్మిస్తారు. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రం ద్వారా ఆయన హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా ధనుష్ గతంలో రజనీకాంత్ కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో వ్యక్తిగత కారణాల రీత్యా విడి పోయారు. తను పలు పేరు పొందని సినిమాలలో నటించాడు. తన నటనతో మెప్పించాడు. రాష్ట్రీయ, జాతీయ అవార్డులను స్వంతం చేసుకున్నాడు. ఇప్పటికే హిందీలో నటించిన అనుభవం తనకు ఉంది. ధనుష్ నటుడిగానే కాకుండా గాయకుడు, గేయ రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. వై దిస్ కొలవెరి డి అనే పాట తనకు , అనిరుద్ రవిచందర్ కు అంతర్జాతీయ పరంగా భారీ గుర్తింపు తీసుకు వచ్చింది.






