హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చారని ఆరోపించారు. వీటిని ఆధారంగా చేసుకుని హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ రావు లు సర్కార్ భూములకు ఎసరు పెట్టారని ఆరోపించారు పొంగులేటి. దీనిపై ఇవాళ సీరియస్ గా స్పందించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను వట్టి నాగులపల్లిలో 2014లో కొన్న భూమిని చూపించి పొంగులేటి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని ఆరోపించారు. నాకు అక్కడ భూమి ఉందని తెలిసి పొంగులేటి బినామీ నా దగ్గరికి వచ్చి భూమి అమ్మమని అడిగాడని బాంబు పేల్చాడు. తాను అమ్మను అని చెప్పడంతో నా భూమిని 22Aలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అందరిని బెదిరించినట్టే నన్ను బెదిరించాలని చూశాడని, కానీ తనాఉ లొంగక పోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ 29 ఎకరాల భూమి నాదని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.





