newsseals.com

అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

September 28, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో కొత్త అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించడంతో పాటు, పూసపాటిరేగ, బొబ్బిలి కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు ఈ సంద‌ర్భంగా మంత్రి. సోంపేట , పాలకొండ కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఈ కేంద్రాల ఏర్పాటు కోసం ₹7.80 కోట్ల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించిన‌ట్లు తెలిపారు. విపత్తు సమయాల్లోనూ తమ ప్రాణాలకు తెగించి ప్రజల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. గత రెండేళ్లుగా అత్యాధునిక పరికరాలు, మెరుగైన వసతులను కల్పించడం ద్వారా అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

అత్యవసర సేవలు ప్రజలకు మరింత వేగంగా చేరేలా చూసేందుకు, ప్రతి నియోజకవర్గంలోనూ అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా త‌మ‌ ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు.

Related News