newsseals.com

తెలంగాణ‌లో 13 రోజుల పాటు ద‌స‌రా సెల‌వులు

September 29, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థులు, పేరెంట్స్ కు తీపి క‌బురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్ర‌క‌టించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు అక్టోబర్ 10 నుండి 22 వరకు (మొత్తం 13 రోజులు) మూసి వేయనున్న‌ట్లు వెల్ల‌డించింది . సీఎం ఆదేశాల మేర‌కు ముఖ్య కార్య‌ద‌ర్శి ఈ మేర‌కు ఉత్వ‌ర్వులు జారీ చేశారు. ఈ విష‌యాన్ని పాఠ‌శాల విద్యా శాఖ వెల్ల‌డించింది.

పాఠశాలలు తిరిగి అక్టోబర్ 23న తెరుచుకుంటాయని పేర్కొంది. తెలంగాణలో జరుపుకునే పండుగలలో దసరా అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ సొంత జిల్లాలకు వెళ్లి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటుగా ప్రజలు ముఖ్యంగా మహిళలు – బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా, అక్టోబర్ 10 నుండి పాఠశాలలు , కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మ‌రో వైపు పండుగ‌ను ఆస‌రాగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్ర‌యాణీకుల‌పై భారం మోపేందుకు రెడీ అయ్యింది. పండుగ పేరుతో ఛార్జీలు మోప‌నుంది.

Related News