newsseals.com

కొండాపూర్ లో అమెజాన్ ఆశ్రయ్ ప్రారంభం

September 29, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని కొండాపూర్‌లో మంగ‌ళ‌వారం ‘ఆశ్రయ్’ కేంద్రాన్ని ప్రారంభించారు CMC కమిషనర్ జి. శ్రీ‌జ‌న‌. రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్ ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గిగ్ , డెలివరీ కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు ఒక వేదికను కల్పిస్తుంది. పని వేళల్లో గిగ్ కార్మికులు సౌకర్యవంతంగా విరామం తీసుకునేలా వారికి అందుబాటులో ఉండే ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మార్గదర్శకత్వంలో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. ఏ కంపెనీ లేదా ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం ఉన్న వారైనప్పటికీ, అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన గిగ్ , డెలివరీ కార్మికులు ఈ కొండాపూర్ కేంద్రాన్ని వినియోగించు కోవచ్చుని ఈ సంద‌ర్భంగా అన్నారు క‌మిష‌న‌ర్ జి. శ్రీ‌జ‌న‌.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే దేశ వ్యాప్తంగా గిగ్ , డెలివ‌రీ కార్మికుల‌కు మేలు చేకూర్చేలా చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింది. వీరికి పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంది. కేంద్రం సూచ‌న మేర‌కు దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌లో వీరికి మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం విశేషం. వీరు నిత్యం సేవ‌లు అందించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంటారు. వీరికి విశ్రాంతి అనేది ఉండ‌డం లేదు. దీనిని గుర్తించింది హెచ్ఎండీఏ. వీరికి రెస్ట్ కోసం ఆశ్ర‌య్ కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆశ్ర‌య్ అందుబాటులోకి వ‌చ్చింది.

Related News