newsseals.com

ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు ఆహ్వానం

September 29, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం శాటిలైట్ లేదా కేబుల్ టీవీ నెట్‌వర్క్ వంటి ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో పనిచేస్తూ ఉండాలి.2025 సంవత్సరంలో ప్రసారమైన ఐదు వార్తా కథనాలను పెన్‌డ్రైవ్‌లో సమర్పించాలి. వీటితో పాటు ప్రతి కథనానికి సంబంధించిన ట్రాన్స్‌క్రిప్ట్ (వార్తా కథనం పూర్తి వివరాలు) కూడా దరఖాస్తుతో జత చేయాలి. వీడియో జర్నలిస్ట్‌కు సంబంధించిన బయోడేటా సమర్పించాలి.

ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఉండాలి. పేరు, పనిచేస్తున్న మీడియా సంస్థ పేరు. జర్నలిజం రంగంలో పని చేసిన అనుభవం.సాధించిన విజయాలు/అవార్డులు , సంప్రదింపుల చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్హతలు ,ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, తదితర వివరాలు ఉండాలని పేర్కొంది. భౌతిక రూపంలో ఉన్న దరఖాస్తు పూర్తి వివరాలతో 2026 అక్టోబర్ 5వ తేదీలోపు విజయవాడలోని డైరెక్టర్, సమాచార & పౌర సంబంధాల శాఖ (I&PR) కార్యాలయానికి చేరేలా సమర్పించాలి.

Related News