newsseals.com

మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి

September 29, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు మ‌హిళ‌ల ప‌ట్ల పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వేధింపులు, రేప్ ల‌కు వ్య‌తిరేకంగా యువ‌త ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు. ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న తెల‌పాల‌ని కోరారు. . మహిళల జీవితాలను పరిమితం చేయడం కాకుండా, నేరస్థులను శిక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు రాహుల్ గాంధీ. “బాధితురాలిని నిందించి, నేరస్థుడిని కాపాడే” వ్యవస్థను సమూలంగా మార్చాలని మంగళవారం పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒత్తిడికి లొంగితేనే స్పందిస్తుందని, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత నిరసనలు చేపట్టాలని ఆయన కోరారు. మహిళలపై జరిగిన నేరాలకు వారిని శిక్షించడం ఆపండి. దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి రావడానికి భయపడుతున్నారు, వేధింపులకు గురవుతామని, అత్యాచారానికి గురవుతామని ఆందోళ‌న చెందుతున్నార‌ని అన్నారు.

దీనికి ప్రభుత్వ సమాధానం ఇంట్లోనే ఉండాల‌ని అంటోంద‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ. ఇది పితృస్వామ్యానికి నిదర్శనం అన్నారు . బాధితురాలిని నిందించ‌డం, నేర‌స్థుల‌ను కాపాడే ఈ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తి ఒక్క‌రు పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనిని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చిందన‌న్నారు . మహిళలను ఇళ్లలో బంధించడం పరిష్కారం కాదని పేర్కొన్నారు ఎంపీ. మన వీధులను సురక్షితంగా మార్చడం, మహిళలను వేధించే పురుషుల మనస్తత్వాన్ని ఎదుర్కోవడం, వారిపై దాడి చేసే వారిని తక్షణమే, ఎలాంటి మినహాయింపు లేకుండా శిక్షించడం పరిష్కారం అని పేర్కొ్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువతులు, ముఖ్యంగా జెన్ జెడ్ తరం వారు, మరింత పెద్ద సంఖ్యలో బయటకు రావాలని తాను కోరుతున్నాన‌ని పేర్కొన్నారు.

Related News