newsseals.com

ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

October 12, 2026 · VijayaBhaskar

అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి, పురోగతిపై సమీక్షించారు. ఉత్తరం, దక్షిణం, పడమర వైపుల ప్రాకారాలు, గోపురాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొంటూ, తూర్పు గోపురం పనులు ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా లేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పు గోపురం పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

అదేవిధంగా రంగనాయక మండపం, వాహన మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, రథ మండపం నిర్మాణ పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న జేఈవోకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకోగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ రోహిత్, ఆలయ అర్చకులు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Related News