newsseals.com

ప్ర‌తి పౌరుడు జ‌ర్న‌లిస్టుగా మారితే ప్ర‌మాదం

October 16, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్రతి పౌరుడూ జర్నలిస్టుగా మారితే అది సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ,జస్టిస్ జొయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రజా నిరసనలను కవర్ చేస్తున్న ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌నం కింద పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

నిర‌స‌న చేప‌ట్ట‌డం, ఆందోళ‌న నిర్వ‌హించ‌డం అనేది పౌరుల‌కు సంబంధించి ప్రాథ‌మిక హ‌క్కు . అలాగ‌ని వ్య‌వ‌స్థల‌ను ల‌క్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేయాల‌ని అనుకోవ‌డం త‌గ‌ద‌ని, ఇది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని న్యాయ వ్య‌వ‌స్థ‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని, వారి ప్ర‌వ‌ర్త‌న‌పై కూడా సీజేఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్ప‌టికే వైర‌ల్ గా మారాయి. త‌ను చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగానే ఇవాళ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పుట్టుకు వ‌చ్చింది. ఏకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

Related News