newsseals.com

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ -2 సూప‌ర్ క‌లెక్ష‌న్స్ వండ‌ర్

October 16, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : అటు ఏపీలో ఇటు తెలంగాణ‌లో దుమ్ము రేపుతోంది త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టించిన సీక్వెల్ మూవీ జైల‌ర్ -2 . సంచలనాత్మక ఓపెనింగ్స్ సాధించింది. ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్, విద్యా బాలన్, మోహన్ లాల్ , సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తితో పాటు పలువురు ప్రముఖ తారాగణం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎంతో ప్రచారం పొందిన ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ర‌జ‌నీకాంత్ స్టైల్ , మేన‌రిజం, డైలాగుల‌తో మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశాడు. ఇక త‌న‌తో పాటు మిగ‌తా న‌టీన‌టులు సైతం పోటీ ప‌డి న‌టించారు. దీంతో జైల‌ర్ -2 పాన్ ఇండియా స్థాయిలో ఆశించిన దానికంటే బిగ్ క‌లెక్ష‌న్స్ సాధిస్తూ ముందుకు వెళుతోంది.

ఇక ఈ యాక్షన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్ల షేర్‌ను రాబట్టింది, ఇది డబ్బింగ్ చిత్రాలలో అత్యధికం అని ఒక డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. తెలుగు ప్రేక్షకులలో రజనీకాంత్ ఆకర్షణ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. సూప‌ర్ స్టార్ తన సత్తాను నిరూపించుకున్నారు అని ఆయన జోడించారు. ఇక ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో దీనికి మిశ్రమ స్పందన లభించింది, ఈ వారాంతంలో ఇది నిలదొక్కుకోవాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. రజనీకాంత్ ప్రజాదరణపై నమ్మకంతో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 కోట్లకు అమ్ముడైంది. ఒక తమిళ దర్శకుడి సినిమాకు ఇదే అత్యధిక వ్యాపారం, పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టు కోవాలంటే రాబోయే రోజుల్లో ఇది భారీ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుందన్నారు స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్.

Related News