newsseals.com

శోభిత ధూళిపాళ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

October 16, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున కోడ‌లు, అక్కినేని నాగ చైత‌న్య రెండో భార్య , ప్ర‌ముఖ న‌టి, మోడ‌ల్ శోభిత ధూళిపాళ సంచ‌ల‌నంగా మారారు. త‌ను తాజాగా వివిధ మ్యాగజైన్ల‌కు ప్ర‌త్యేకంగా ఫోజులు ఇస్తున్నారు. త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌ను పిచ్చెక్కిస్తున్నారు. దీంతో త‌న‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక శోభిత ధూళిపాళ గురించి చెప్పాలంటే వెరీ వెరీ స్పెష‌ల్. త‌న స్వ‌స్థ‌లం ఏపీ. తెలుగు మూలాలున్న భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటించి గుర్తింపు పొందారు. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై ఆసక్తి మరింత పెరిగింది.

ఏపీలోని తెనాలిలో మే 31, 1992లో పుట్టారు పెరిగిన ప్రాంతం విశాఖపట్నం . ముంబై విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్య అభ్య‌సించారు. నాగ చైత‌న్యతో 4 డిసెంబర్ 2024 లో వివాహం జ‌రిగింది. 2013లో శోభిత ధూళిపాళ ఫెమినా మిస్ ఇండియా గా విజేత‌గా నిలిచింది. మిస్ ఎర్త్ కు సంబంధించి భార‌త్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించారు. రామ‌న్ రాఘ‌వ్ హిందీ సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేశారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. 2018లో గూఢ‌చారి మూవీలో అడవి శేష్ స‌ర‌స‌న స‌మీరా రావు పాత్ర‌ను పోషించారు. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సీరీస్ లో కీ రోల్ పోషించారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2022లో మేజ‌ర్ మూవీలో న‌టించి మెప్పు పొందారు.

Related News