జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
అమరావతి : ఏపీలో స్తానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైంది జనసేన పార్టీ. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొరేషన్లకు సంబంధించి ఏలూరు స్థానానికి పార్టీ తరపున శ్రీరెడ్డి అప్పలనాయుడు, విజయవాడ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణను ప్రకటించారు. ఇక మున్సిపాలిటీల పరంగా చూస్తే అమలాపురం నుంచి జనసేన అభ్యర్థిగా నల్లా శ్రీధర్, చిలకలూరి పేటకు తోట రాజ రాజేశ్వరి, గొల్లప్రోలుకు కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురంకు కొత్తపల్లి శైలజ, నిడదవోలుకు కల్లం జ్యోతిని ఖరారు చేశారు జనసేన పార్టీ చీఫ్.
ఇక పెడన మున్సిపాలిటీకి ఘట్టా శివ పావని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంకు డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు మున్సిపాలిటీకి డి. ఏలుమలై, సాలూరుకు గొర్లె విజయ కుమారి, సామర్లకోటకు పిట్టా జానకి రామారావు, గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీకి తోటకూర వెంకట రమణరావు, తిరువూరుకు పి. మాధవిని అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ప్రకటించారు జనసేన పార్టీ చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల.