newsseals.com

కావ్య మార‌న్ అనిరుధ్ వివాహ రిసెప్ష‌న్

October 17, 2026 · VijayaBhaskar

చెన్నై : చెన్నై సూప‌ర్ కింగ్స్ య‌జ‌మాని , అందాల ముద్దుగుమ్మ కావ్య మార‌న్ , ఇండియ‌న్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంచ‌ల‌నంగా మారారు. ఈ ఇద్ద‌రూ త్వ‌ర‌లో ఒక్క‌టి కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇన్విటేష‌న్ ను భార‌త దేశంలోని ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం అందిస్తున్నారు. శ‌నివారం కావ్య మారన్ – అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అంద‌జేశారు. అంతకు ముందు మారన్ కుటుంబం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించింది. ఈ భారీ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది .

సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కలిసి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ఇక కావ్య మార‌న్ గురించి చెప్పాల్సి వ‌స్తే త‌ను కలానిధి మారన్ కుమార్తె. స‌న్ గ్రూప్ , స‌న్ టీవీ నెట్ వ‌ర్క్, వ్యాపార , వాణిజ్య కుటుంబానికి చెందిన వారు. ఐపీఎల్ లో కీల‌క‌మైన జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ఓన‌ర్ గా , సీఈఓగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కావ్య మార‌న్. ఇక అనిరుధ్ ర‌విచంద‌ర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు, గాయకుడు. వీరిద్ద‌రూ గ‌త కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు సైతం ఓకే చెప్పారు. వీరికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ సూప‌ర్ స్టార్ హీరో ర‌జ‌నీకాంత్.

Related News