తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల
అమరావతి : టీడీపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. మచిలీపట్నం కార్పొరేషన్ కు టీడీపీ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా, ఆకివీడు మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా నిలోఫర్ షేక్. బేతంచర్ల మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా లోకేశ్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభ్యర్థిగా దొడ్ల విజయలక్ష్మి , చీరాల మున్సిపాలిటీ అభ్యర్థిగా యెర్రిచర్ల హనీ స్పందన, డోన్ మున్సిపాలిటీకి అభ్యర్థిగా కొట్టా సుజాతమ్మను ఖరారు చేశారు పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఇక గుత్తి మున్సిపాలిటీ అభ్యర్థిగా అభ్యర్థిగా గోవిందరాజులు తమిళ్ సెల్వి, గుంతకల్లు మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా యశోద, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభ్యర్థిగా రొంగల అనుష, కదిరి మున్సిపాలిటీకి షేక్ సమీరాను ఎంపిక చేశారు.
కల్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా బుట్టా లక్ష్మికి ఛాన్స్ ఇచ్చారు పార్టీ చీఫ్. కొండపల్లి మున్సిపాలిటీకి అభ్యర్థిగా కన్నకంటి అమూల్య, కొవ్వూరరు మున్సిపాలిటీకి జొన్నలగడ్డ రాధారాణి.
నాయుడుపేట మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా షకీరా, నందిగామ మున్సిపాలిటీ అభ్యర్థిగా శాకమూరి వంశీధర్, నందికొట్కూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా సబూ రున్నీసా, నర్సీపట్నం మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా చింతకాయల పద్మావతిని ఎంపిక చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి, వెంకటగిరి మున్సిపాలిటీ అభ్యర్థిగా దొంతు శారద, ఉయ్యూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, ఏలేశ్వరం మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా మాచాని సునీతను ఖరారు చేశారు.