newsseals.com

జైల‌ర్ -2 భారీ వ‌సూళ్ల‌తో నాగవంశీ బ‌హుత్ ఖుష్

October 18, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రం జైల‌ర్ -2 . ఇది జైల‌ర్ -1కి సీక్వెల్. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ వ‌సూళ్లు సాధించే దిశ‌గా దూసుకు పోతోంది. ఇక తెలుగు వెర్ష‌న్ లో జైల‌ర్ -2 మూవీని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ. దీంతో సినిమా ఆడుతుందో లేదోన‌న్న బుగులు క‌లిగింది . కానీ చివ‌ర‌కు జైల‌ర్ -2 బిగ్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ అక్టోబ‌ర్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సులు నిండి పోతున్నాయి కాసుల‌తో. అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ కూడా పేర్కొంటున్నారు. మ‌రో వైపు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ త‌లైవా , 75 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ర‌జ‌నీకాంత్ ను కొత్త‌గా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

అద్భుత‌మైన లొకేష‌న్స్, సీన్స్ , డైలాగుల‌తో పాటు ఎప్ప‌టి లాగే త‌న‌దైన స్టైల్ లో ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ఈ సంద‌ర్బంగా జైల‌ర్ -2 బిగ్ స‌క్సెస్ సాధించ‌డం, ఆపై ఆశించిన దానికంటే క్రౌడ్ పెర‌గ‌డం, వ‌సూళ్లు రావ‌డంతో స్పందించాడు నాగ‌వంశీ. తాము నిర్మించినా లేదా పంపిణీ చేసినా, పంపిణీదారులకు వారి కమీషన్ దక్కినప్పుడు త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంటుందన్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో పంపిణీదారులకు వారి కమీషన్ దక్కడం చాలా అరుదై పోయింద‌ని పేర్కొన్నాడు. తాము చాలా ఎక్కువ ధర నిర్ణయించామని మొదట్లో అందరూ భయపడ్డారు. కానీ, అక్టోబర్ 15న సాయంత్రం ప్రదర్శనల వసూళ్లను చూసిన తర్వాత, పంపిణీదారులే స్వయంగా తమకు కమీషన్ ఖచ్చితంగా అందుతుందని నమ్మకంతో చెప్పారని తెలిపాడు.

Related News