newsseals.com

బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన సీబీఎస్‌ఈ

November 7, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026–27 విద్యా సంవత్సరానికి గాను 10 , 12వ తరగతుల బోర్డు పరీక్షల అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీనివల్ల విద్యార్థులకు రాబోయే పరీక్షల కాలపట్టికపై స్పష్టత లభించింది. నవంబర్ 6న‌ ప్రకటించిన టైమ్‌టేబుల్ ప్రకారం, ఈ రెండు తరగతులకు బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16, 2027న ప్రారంభమవుతాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయని అధికారికంగా వెల్ల‌డించింది.

10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 9, 2027తో ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9, 2027 వరకు కొనసాగుతాయి .పరీక్షల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు , పాఠశాలలు తమ విద్యాపరమైన సన్నద్ధతను, పునర్విమర్శ (రివిజన్) కార్యక్రమాలను ముందుగానే ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

సీబీఎస్‌ఈ తన అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయి పరీక్షా కాలపట్టికను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారిక షెడ్యూల్‌లో చూసుకోవాలని సూచించడమైనది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ప‌లు కీల‌క మార్పులు చేసింది. ప్ర‌ధానంగా త‌మ‌కు అనుకూల‌మైన పాఠ్యాంశాల‌ను చేర్చ‌డం ప‌ట్ల మేధావులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. మ‌రో వైపు విద్యా వ్య‌వ‌స్థ భ్ర‌ష్టు ప‌ట్టింద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు.

Related News