NEWSTELANGANA

కాంగ్రెస్ మోసం జ‌నానికి శాపం

Share it with your family & friends

ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం ఖాయం

వ‌రంగ‌ల్ జిల్లా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై భ‌గ్గుమ‌న్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చి ప‌వ‌ర్ లోకి వ‌చ్చార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం గ్యారెంటీల ఊసెత్త‌డం లేద‌న్నారు. వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు.

24 ఏళ్ల పాటు బీఆర్ఎస్‌కు సేవ చేసిన డాక్టర్ సుధీర్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చార‌ని, ఆయ‌న‌ను గెలిపించు కోవాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు కేటీఆర్. 39 సీట్లు గెలిచామ‌ని, 14 సీట్ల‌ను త‌క్కువ తేడాతో కోల్పోయామ‌ని చెప్పారు. అర చేతిలో వైకుంఠం చూపించి రేవంత్ రెడ్డి సీఎం సీటులోకి వ‌చ్చాడ‌ని ఎద్దేవా చేశారు. జ‌నం ఆయ‌న మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు అభ‌య హ‌స్తం త‌ర్వాత భ‌స్మాసుర హ‌స్తంగా మారింద‌ని ఎద్దేవా చేశారు. మార్చి 17 లోపు అన్నింటిని అమ‌లు చేస్తాన‌ని చెప్పిన రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. జ‌నాన్ని అడ్డ‌గోలుగా అందంగా మోసం చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు కేటీఆర్.

ద‌మ్ముంటే ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి చూపించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.