ఎల్ నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

హైద‌రాబాద్ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్‌ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్‌ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు గ్రామసభల నుంచే రావాలని, ఐదు, పది సంవత్సరాల దృష్టితో గ్రామాల భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయంతో ఒకే పనికి అనేక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని సీతక్క‌ అన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న క్షేత్రస్థాయి అధికారులు రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో వేల సంఖ్యలో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపనలు చేశారని, వాటి నిర్మాణాలను వేగవంతం చేసి త్వరలో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను మంత్రులు, సీఎస్‌ ప్రారంభించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు ఇందులో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.

  • Related Posts

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

    బెంగ‌ళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *