పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు

హైద‌రాబాద్ : తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాల‌ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించ‌చారు. జిల్లాల ప్రత్యేకతలు, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కి 27 స్పెషల్ టూరిజం ప్రదేశాలు (ఎస్ టిఎ)లను గుర్తించిందని, ఆ ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసి టూరిజం సెక్టార్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని సిఎస్ అన్నారు. తెలంగాణ బ్రాండ్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఈ టూరిజం 20247 ప్రణాళికలు ఎంతో ఉపయోగ పడుతాయని ఆయన అన్నారు. స్పిర్చువల్ , హెరిటెజ్, ఎకోటూరిజం, క్రాప్ట్స్ టూరిజం విస్తరణకు అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సిఎస్ (YATC) వాణిప్రసాద్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పోలీస్ శాఖ డిజి మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ‘వ‌న్ వార్డ్ ఎవ్రీ డే’లో స‌మ‌స్య‌ల వెల్లువ‌

    హైద‌రాబాద్ : సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ జి. సృజ‌న వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ మేర‌కు వ‌న్ వార్డ్ ఎవ్రీ డే పేరుతో స్థానికుల‌తో స‌మావేశం కావ‌డం దీని ఉద్దేశం. ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా…

    పోల‌వ‌రం ద్వారా ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జలాలు

    అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *