కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ లాంచ్

హైదరాబాద్ : జయశ్రీ మీడియా సమర్పణలో తెర కెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన సంభాషణలను రచ్చ రవి అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

  • Related Posts

    న‌టి శ్రీ‌లేఖ మిత్ర‌కు కోల్ క‌త్తా హైకోర్టు భారీ ఊర‌ట

    కోల్ క‌తా : శ్రీలేఖ మిత్ర ప్రదర్శించిన ప్రధాని న‌రేంద్ర మోదీ పోస్టర్ పట్ల కలకత్తా హైకోర్టు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. కార్టూన్ ‘అసభ్యకరమైనది’ అని వ్యాఖ్యానించినప్పటికీ అరెస్టు నుండి రక్షణ కల్పించింది. బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ప్రధాని నరేంద్ర…

    ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి త‌ప్పుకున్న బండ్ల గ‌ణేష్ ..?

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ పోటీ నుండి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబర్ 6న ఎన్నికలు జరగనుండగా, సుమారు 800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. విశ్వసనీయ వర్గాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *