మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా రైతుల నిర‌స‌న

చెన్నై : మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా 5 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు రైతులు ప్ర‌క‌టించారు. గురుగ్రామ్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో రైతుల ప్రతినిధి బృందం ఐదు గంటల పాటు స‌మావేశ‌మైంది. అనంత‌రం రైతు సంఘం అధ్యక్షుడు పి.ఆర్. పాండియన్ కీల‌క ప్రకటన చేశారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మేకెదాటు వద్ద కావేరి నదిపై ఆనకట్ట నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 20 నుండి ఐదు రోజుల పాటు భారీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తమిళనాడులోని అన్ని రైతు సంఘాల సమన్వయ కమిటీ శుక్రవారం ప్రకటించింది. స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం కర్ణాటక రాజకీయ నాయకత్వం మేకెదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు పాండియ‌న్.

పూంపుహార్‌లో ప్రారంభమయ్యే ఈ ఉద్యమం తర్వాత తమ డిమాండ్లను వినిపించడానికి అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామని తెలిపారు. ఈ సంద‌ర్బంగా విలేకరులతో మాట్లాడుతూ కావేరి నదిపై ప్రతిపాదిత ఆనకట్టను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల సంఘం కి సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక మోసపూరితమైనది , చట్టపరంగా చెల్లనిదని పేర్కొన్నారు. ఈ డీపీఆర్ కు తమిళనాడు, పుదుచ్చేరి , కావేరి జల నిర్వహణ అథారిటీ నుండి అవసరమైన అనుమతులు లేవని ఆయన ఎత్తిచూపారు. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి పర్యావరణ లేదా అటవీ అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఆనకట్ట తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని రైతులకు హానికరమని పాండియన్ హెచ్చరించారు.

  • Related Posts

    కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?

    వ‌రంగ‌ల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన కొండా సురేఖ కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా…

    ఛత్తీస్‌గఢ్ సీఎంతో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భేటీ

    న్యూఢిల్లీ : రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో విష్ణు దేవ్ సాయి తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసి కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్క…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *