అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించారు. ఇదిలా ఉండగా సీఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు సీఎం. 12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. 2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లిస్తామన్నారు. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల చేశామన్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేస్తామని పేర్కొన్నారు.
పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తించేలా చేస్తామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం తెలిపామన్నారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు అవుతుందని అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.






