డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యా యత్నం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ జాన‌ప‌ద డ్యాన్స‌ర్ మాధురీ రాథోడ్ ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డడం క‌ల‌కలం రేపింది. త‌న తోటి న‌టుడు ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయక పోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేసిన‌ట్లు కుటుంబీకులు ఆరోపించారు. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదంటూ మాధురి రాథోడ్ వాపోయింది. ఇదిలా ఉండ‌గా మాధురీ రాథోడ్, ఈశ్వ‌ర్ సాయి ఇటీవ‌లే దుమ్ము రేపిన ఫోక్ సాంగ్ బాసింగ బ‌లాలే పాట‌కు క‌లిసి న‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ డ్యాన్స‌ర్ ఆరోపించింది.

ఇక మాధురీ రాథోడ్ విష‌యానిక‌వ వ‌స్తే త‌ను తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన బంజారా జానపద నర్తకి. ఇన్‌ఫ్లుయెన్సర్ ,మోడల్. ఇంజనీరింగ్ విద్యార్థినిగా మొదలుపెట్టి ఒక ప్రముఖ డిజిటల్ కళాకారిణిగా ఆమె ప్రయాణం సాగించింది. సోషల్ మీడియాపై ప్రాంతీయ జానపద సంస్కృతికి పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. 2000లో జన్మించిన మాధురి రాథోడ్, 2019లో తన బీ.టెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన నృత్య ప్రదర్శనలు , వైరల్ అయిన జానపద కంటెంట్ వీడియోల ద్వారా విస్తృత ప్రేక్షకాదరణ పొందారు. ఆమె ఎదుగుదల కళాశాల రోజుల్లోనే ప్రారంభమైంది. క్రమంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుండి ‘ఢీ 20’ ద్వారా ప్రధాన స్రవంతి టెలివిజన్‌లోకి అడుగు పెట్టారు.

ఆధునిక డిజిటల్ కంటెంట్‌ను, సాంప్రదాయ బంజారా గుర్తింపుతో ఆమె మిళితం చేసే విధానమే మాధురి రాథోడ్ కథను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆమె తన సాంస్కృతిక నేపథ్యాన్ని తన వృత్తిపరమైన గుర్తింపు నుండి వేరు చేయకుండా, దానిని తన బహిరంగ వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగించుకుంది.

  • Related Posts

    ఆస్తుల కంటే బంధాలు ముఖ్యం : కియానూ రీవ్స్

    హైద‌రాబాద్ : త‌న‌కు పిల్ల‌లు ఎందుకు లేర‌నే విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ‌ హాలీవుడ్ సూపర్ స్టార్ కియానూ రీవ్స్ . నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నా దగ్గర 350 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ, నా అంతరాత్మలో…

    రూ. 1000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్ర‌కు షాక్

    ముంబై : రూ. 1,000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు. చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణాలు పొందేందుకు తన నికర ఆస్తి విలువను వాస్తవానికి మించి చూపించారనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *