Friday, 6 November 2026

జీవో 14ను ఉపసంహరించు కోవాలి

newsseals-MadhusudhaanaChary

హైదరాబాద్: బీసీ ఆత్మ గౌరవ భవనాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.14ను తక్షణమే ఉపసంహరించు కోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సంఘాలకు కేటాయించిన భవనాలు, భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి స్వయం ప్రతిపత్తిని, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా ‘చలో కోకాపేట్’ కార్యక్రమానికి ప్రణాళికలను ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఎస్. మధుసూదన చారి మాట్లాడారు. ఈ నిర్ణయం బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని అన్నారు. సామాజిక వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైనందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణచి వేస్తోందని ఆరోపించారు

కె. చంద్రశేఖర్ రావు హయాంలో తీసుకున్న సంక్షేమ చర్యలతో ప్రభుత్వ పనితీరును పోలుస్తూ, కరువు, విద్యుత్ కొరతపై కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. బీసీ సంఘాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో జీవో 189 జారీ చేసిందని అన్నారు. ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి రూ.97.5 కోట్లు కేటాయించిందని మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కుల సంఘాలకు ప్రభుత్వ భూములు కేటాయించారని, ప్రభుత్వ జోక్యం లేకుండా భవనాలను నిర్వహించు కోవడానికి ప్రతి సామాజిక వర్గాన్ని సొంత ట్రస్టును ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *