డిఎస్సీ అంటే జగన్ మోహ‌న్ రెడ్డికి జెల‌సీ : లోకేష్

నెల్లూరు జిల్లా : రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. డిఎస్సీకి, ఎపిపిఎస్సీ కి తేడా తెలియని వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో అనేక మంది సిఎంలను చూశా, గత అయిదేళ్లలో సైకోని చూశా. గొడ్డలిపార్టీ అధినేతకు డిఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తొస్తాయి. వారు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క టీచర్ పోస్టు ఇవ్వలేదు. మనం 16వేల టీచర్ పోస్టులు ఇస్తే ప్రశ్నిస్తున్నారు. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలతో సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించాలని హైకోర్టులో వాళ్లు పిటిషన్ వేశార‌న్నారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో పిల్ వేస్తే విత్ డ్రా చేసుకున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 53రోజులు జైలులో పెడితే సింహంలా తిరిగి వచ్చారు. ఆయన ఎప్పుడు భయపడలేదు. నేను మళ్లీ చాలెంజ్ చేస్తున్నాను. డిఎస్సీపై చర్చకు నేను, సిద్ధం, జగన్ సిద్ధమా అని స‌వాల్ విసిరారు.

అరిగి పోయిన రికార్డులా డిఎస్సీలో అవకతవకలు అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఎటువంటి తప్పు జరగక పోయినా ప్రజలను నమ్మించేలా వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మనం నిజాన్ని ఎక్కువ సార్లు ప్రజలకు చెప్పాలి. ఇటీవల 10వేల టీచర్, పోలీసు, ఇతర పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. అదీ మన చిత్తశుద్ది అని ప్ర‌క‌టించారు. వైసిపి నాయకులు కులం ముసుగులో జనంలోకి వస్తున్నారు. సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేస్తే మరొకరిని తీసుకొచ్చి కేసు మాఫీ చేసుకోవాలని చూశాడు. జగన్ చనిపోయిన బిసి కుటుంబం పరామర్శకు వెళ్లకుండా అప్పలరాజు ఇంటికి వెళ్లాడు. జగన్ బడా చోర్ అయితే, కారుమూరు నాగేశ్వరరావు చోటా చోర్. మద్యంలో 400 కోట్లు దోచేసి, కోడలు ఎకౌంట్ లో వేసి బుక్ చేశాడు. ఇన్‌కం టాక్స్, ఈడి వాళ్లు వచ్చి బొక్కలో వేశారు. ఆ వ్యవహారంలో మనకు సంబంధం లేదు. అయినా మనపై తోస్తున్నారు.

  • Related Posts

    కోటి మంది కార్య‌క‌ర్త‌ల బ‌లం ‘తెలుగుదేశం’

    అమ‌రావ‌తి : కార్యకర్తలంతా నా తెలుగుదేశం, నా బాధ్యత అనే నినాదానికి కట్టుబడి ఉండాలి. జిల్లా నుంచి పార్లమెంటు వ్యవస్థ తేవడానికి మూడు పొలిట్ బ్యూరో సమావేశాలు పట్టింది. పార్టీలో మార్పు రావాలి, యువరక్తం రావాలని పోరాడాన‌ని అన్నారు పార్టీ వ‌ర్కింగ్…

    19న 3 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ

    హైద‌రాబాద్ : రాష్ట్రంలో వ‌ర్షాలు భారీగా కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని వర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం సెప్టెంబర్ 19న ములుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *