సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న హైద‌రాబాద్ లో మాట్లాడారు. త‌మ గురించి , ప్ర‌త్యేకించి అక్ర‌మ ఆస్తులు క‌లిగి ఉన్నామంటూ శాస‌న స‌భ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌త కొన్ని ఏళ్ల నుంచి త‌ప్పుడు కూత‌లు కూస్తూ స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన మ‌హా నాయకుడు , మాజీ సీఎం కేసీఆర్ గురించి తూల‌నాడ‌డం దారుణ‌మ‌న్నారు. ఇక‌నైనా తాను మారాల‌ని లేక పోతే జ‌నం బుద్ది చెప్ప‌క త‌ప్ప‌ద‌న్నారు. కూకట్‌పల్లిలో కొండయ్య రావు అనే పెద్ద మనిషి ఉంటే, రేవంత్ రెడ్డి అతని ఆస్తులను కూడా మా ఖాతాలోనే జమ చేస్తారా? అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

మాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. కేవలం వెలమ‌ కులం అనే విషయం తప్ప, ఇంకేమీ లేద‌న్నారు మాజీ మంత్రి. కేసీఆర్ సోదరీమణులు, బావమరుదుల పిల్లలు సుమారు 300 మంది ఉంటారని, వారి ఆస్తులను కూడా మా ఖాతాలోనే జమ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. సీఎంకు ఇది త‌గ‌ద‌న్నారు. ఇక నవీన్ రావుతో గానీ, కొండయ్య రావుతో గానీ మాకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకవేళ మాకు సంతోష్ రావుతో సంబంధం ఉండి ఉంటే, ఆయన ఆస్తులను కూడా మీరు కేసీఆర్ ఖాతాలో జమ చేస్తారా? అని ప్ర‌శ్నించారు. మీ బావ మరుదుల పిల్లల ఆస్తులను మీ ఖాతాలో జమ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అని స‌వాల్ విసిరారు.

  • Related Posts

    పార‌ద‌ర్శ‌కంగా రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న : భ‌ట్టి విక్ర‌మార్క‌

    ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా…

    విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ కు జ‌గ‌న్ నివాళి

    తాడేప‌ల్లి గూడెం : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఇవాళ‌. ఈ సందర్భంగా గురువారం తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *