ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ గ్రాండ్ లాంచ్

చెన్నై : భారతరత్న, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘M.S. A Legacy On Screen’ చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు రాజ్య‌స‌భ స‌భ్యుడు, ప్ర‌ముఖ న‌టుడు లోకనాయకుడు కమల్ హాసన్ .ఎం.ఎస్. సుబ్బులక్ష్మి చరిత్రను వెండితెర పైకి తీసుకు రావడం అద్భుతమని ప్ర‌శంసించారు, ఈ కార్యక్రమంలో భాగం కావడం దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నానని కమల్ భావోద్వేగంతో అన్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను పోషిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌ను చూస్తే సంతోషంగా ఉంద‌న్నారు.

ఇంతటి ఐకానిక్ పాత్రను ధైర్యంగా చేయాలంటూ రష్మికకు కమల్ ధైర్యం చెప్పారు. ప్ర‌తి క‌ళాకారుడు లేదా న‌టీమ‌ణుల‌కు ఇలాంటి అవ‌కాశాలు రావ‌ని, అరుదుగా వ‌స్తుంటాయ‌ని, దీనిని ఓ ఛాలెంజ్ గా తీసుకోవాల‌ని సూచించారు క‌మ‌ల్ హాస‌న్. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండి తెర‌పై తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం అభినంద‌నీయ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాను గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్), రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (రాక్‌లైన్ వెంకటేష్), బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సుబ్బుల‌క్ష్మి పాత్రను పోషిస్తోంది ర‌ష్మిక మంద‌న్నా.

  • Related Posts

    బిగ్ బాస్ -10 లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్

    హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 10 రియాల్టీ షో జ‌నార‌ణ‌తో దూసుకు వెళుతోంది. ఇప్ప‌టికే ప్రారంభ‌మై వారం గ‌డిచి పోయింది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది ప్రేక్ష‌కుల‌లో. అయితే…

    విజ‌య్ సేతుప‌తి కామెంట్స్ క‌ల‌క‌లం

    చెన్నై : త‌మిళ‌నాడు చ‌ల‌న‌, రాజ‌కీయ రంగాల‌లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్. త‌ను ప్ర‌స్తుతం న‌టుడిగానే కాకుండా హొస్ట్ గా కూడా అవ‌తారం ఎత్తాడు. జియో హాట్ స్టార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *