టాలీవుడ్‌లోకి న‌టి స్నేహ రీ-ఎంట్రీ ..?

హైద‌రాబాద్ : వ‌ర్ద‌మాన న‌టి స్నేహ సంచ‌ల‌నంగా మారారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న భారీ అంచనాల చిత్రం ‘కాకా’లో స్నేహ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఘనంగా విడుదల కానుంది. ‘తొలి వలపు’, ‘గౌరి’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శ్రీరామదాసు’ వంటి తెలుగు చిత్రాలలో నటించింది తమిళ నటి స్నేహ. కొంత కాలం పాటు ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే బుల్లి తెర‌పై న్యాయ నిర్ణేత‌గా త‌ళుక్కుమ‌న్నారు. త‌న అభిప్రాయాల‌ను, అందంతో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చారు. తాజాగా ‘కాకా’ సినిమాతో టాలీవుడ్‌లోకి తిరిగి వస్తున్నారు. చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో స్నేహ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె చిరంజీవి భార్య పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. చిరంజీవితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న స్నేహకు ఇది ఒక కల నిజమైన సందర్భం. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె ‘అమ్ములు పాప’ పాత్రను అనస్వార రాజన్ పోషిస్తున్నారు. నివేదా పేతురాజ్, సునీల్ , గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

  • Related Posts

    ఫిల్మ్ మేక‌ర్ డొమినిక్ సంగ్మాపై దాడి..ఇద్ద‌రు అరెస్ట్

    అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ : అరుణాచల్ ప్రదేశ్ రాజధాని శివార్లలో FTII విద్యార్థుల బృందానికి , నిందితులకు మధ్య జరుగుతున్న గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన జాతీయ అవార్డు గ్రహీత చిత్రనిర్మాత డొమినిక్ సంగ్మాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు శుక్రవారం…

    ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ గ్రాండ్ లాంచ్

    చెన్నై : భారతరత్న, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘M.S. A Legacy On Screen’ చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు రాజ్య‌స‌భ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *