రిజర్వాయర్లల్లో నీటి మట్టాలపై సీఎం ఆరా

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు ఎలా ఉన్నాయి..? అలాగే వివిధ నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రవాహాల వివరాలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 29 రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు పెరిగాయని ముఖ్యమంత్రికి వివరించారు. 23వ తేదీన ఆయా రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టీఎంసీలు ఉండగా… 26వ తేదీ నాటికి 21 టీఎంసీలు మేర నీటి మట్టాలు పెరిగాయని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 5 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని తెలిపారు. ఇక కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని 18 రిజర్వాయర్ల పరిధిలో సుమారు 16 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని అధికారులు వెల్లడించారు. పెరిగిన ఈ నీటి మట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇక వివిధ బేసిన్లల్లోని ప్రవాహాల విషయానికొస్తే… కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార బేసిన్లల్లో నీటి ప్రవాహాలు గతంతో పోల్చుకుంటే పెరిగాయని అధికారులు వివరించారు. ఉత్తరాంధ్రలో నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలు, నిల్వ పరిస్థితిని ఇరిగేషన్‌ అధికారులు వివరించారు. వంశధార పరివాహక ప్రాంతంలో గోట్టా బ్యారేజీకి సెప్టెంబరు 20న 7,214 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25న 47,100 క్యూసెక్కులకు పెరిగిందని తెలిపారు. నాగావళి పరివాహక ప్రాంతంలోని నారాయణపురం ఆనకట్టకు ఇన్‌ఫ్లో 2,100 నుంచి 49,800 క్యూసెక్కులకు పెరిగిందని, మడ్డువలస ప్రాజెక్టులో గతంలో 918 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే.. ప్రస్తుతం 18 వేల క్యుసెక్కుల మేర నీటి ప్రవాహం పెరిగిందని తెలిపారు.

  • Related Posts

    29న ఉద‌య‌గిరికి సీఎం, డిప్యూటీ సీఎం రాక

    అమ‌రావ‌తి : ఈనెల 29వ తేదీన ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టిస్తార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ వెల్ల‌డించారు. ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తార‌ని తెలిపారు.…

    రెడ్డి, రావు జాయేగా బీసీ సీఎం ఆయేగా : తీన్మార్ మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర కొడంగల్‌కు చేరుకుంది. గోల్కొండ ఖిల్లా నుంచి దాదాపు 250…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *