హైదరాబాద్ : తెలంగాణకు చెందిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రం ది ప్యారడైజ్. ఇందులో కీ రోల్స్ పోషించారు న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్, కయాదు లోహర్. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇందులో ముఖ్య పాత్ర పోషించిన కేసీఆర్ పాత్రకు ఎక్కువ బజ్ వచ్చింది. ఈ పాత్రలో ప్రముఖ నటుడు ప్రియదర్శి నటించాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ క్యారెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో నిన్నటి దాకా స్తబ్దుగా ఉన్న గులాబీ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేలా చేసింది. కన్నింగ్ కంత్రిగాళ్ల అక్కసు రివ్యూలపై కన్నెర్ర చేశారు తెలంగాణ బిడ్డలు.
నైజాం నుండి నార్త్ అమెరికా దాకా జడల్ శివాల్ ఎత్తేలా చేసింది. ఎత్తికొడితే టైర్ టూ నుండి టైర్ వన్ లోకి నాని మూవీ చేరడంతో మూవీ బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఊరమాస్ హీరోగా నానిపై రాజముద్ర వేయించిన ఘనత మాత్రం దర్శకుడికే దక్కుతుంది. గణేష్ మహానిమజ్జనోత్సవాల్లో అంతా ఆయా షేర్ మంత్రమే టాప్ లో కొనసాగింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ తో సైతం స్టెప్పులేయించింది ఈ పాట. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ది ప్యారడైజ్.రెండు సినిమాలతో ఓదెలకు ఎక్కడలేని హైప్ వచ్చేలా చేసింది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం.







