29న ఉద‌య‌గిరికి సీఎం, డిప్యూటీ సీఎం రాక

అమ‌రావ‌తి : ఈనెల 29వ తేదీన ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టిస్తార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ వెల్ల‌డించారు. ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తార‌ని తెలిపారు. దీనిని స‌క్సెస్ చేసేందుకు గాను చింతరెడ్డిపాలెంలోని మంత్రి నారాయణ‌ క్యాంప్ కార్యాలయంలో తోటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బి.సి. జనార్ధన్ రెడ్డి , పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా టిడిపి అధ్యక్షుడు బిడ రవిచంద్ర తో కలిసి ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ,వివిధ శాఖల అధికారులతో కలిసి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అవసరమైన సూచనలను జారీ చేశారు.

లక్షకు పైగా ప్రజలు, కార్యకర్తలు , అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, తాగునీరు , ఇతర కనీస సౌకర్యాల విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. అలాగే అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించామ‌న్నారు గొట్టిపాటి ర‌వికుమార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ పర్యటనను ఘనంగా నిర్వహించి, ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే మా అందరి ఉమ్మడి లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రెడ్డి, రావు జాయేగా బీసీ సీఎం ఆయేగా : తీన్మార్ మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర కొడంగల్‌కు చేరుకుంది. గోల్కొండ ఖిల్లా నుంచి దాదాపు 250…

    ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం

    రంగారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా చూసేందుకు ‘శాచురేషన్ మోడ్’ (పూర్తి స్థాయి లక్ష్య సాధన విధానం)లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పంచాయతీ రాజ్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *