రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం ఆగదన్నారు. 2.36 లక్షల ఓట్లలో 1.36 లక్షలు బీసీలవే ఉన్నాయ‌న్నారు. 12 వేల రెడ్ల ఓట్లతో కొడంగల్ లో రాజకీయం ఎలా చేస్తారని ప్ర‌శ్నించారు. రెడ్లు, వెలమల రాజకీయం బీసీలు వేసే బిచ్చం అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ దగా చేస్తోంద‌ని ఆరోపించారు మల్ల‌న్న‌. అసెంబ్లీలో దొంగ బిల్లు తెచ్చి కోర్టుల ద్వారా అడ్డుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% కాంట్రాక్టుల హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ ఎక్కడ ఉంద‌ని నిల‌దీశారు. ముదిరాజ్, వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయ‌ని ఫైర్ అయ్యారు.

రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ ఏమయ్యాయి? ఆర్టీసీ విలీనం హామీ ఏమైందని భ‌గ్గుమ‌న్నారు. బీసీలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చ‌రించారు. 2023 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలను రేవంత్ రెడ్డి నమ్మకుండా కామారెడ్డిలో కూడా పోటీ చేశారని మల్లన్న తెలిపారు. ముఖ్యమంత్రి కావడానికి రాత్రింబవళ్లు కష్టపడిన కొడంగల్, కోస్గి యువతను, కాంగ్రెస్ కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని, స్థానిక యువతే తనకు స్వయంగా ఉత్తరం రాసినట్లు తెలిపారు. కొడంగల్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, రూ.4 వేల పింఛన్/ఆసరా హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. “తొక్కుకుంటూ వచ్చానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.. కానీ ఆయన తొక్కింది కాంగ్రెస్ కార్యకర్తలను, బీసీలనే” అని మల్లన్న మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున నేను ప్రచారం చేయకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని అన్నారు.తాను ప్రచారం చేసిన 42 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు.

  • Related Posts

    ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క

    హైద‌రాబాద్ : సంపాదించ‌డం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాల‌ని అన్నారు మంత్రి సీత‌క్క‌. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన పింక్ ర‌న్ ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని…

    ఎస్ఎంఎస్ టారిఫ్ వోచ‌ర్ల‌పై రాఘ‌వ్ చ‌ద్దా కామెంట్స్

    న్యూఢిల్లీ : కొత్త వాయిస్, SMS-మాత్రమే టారిఫ్ వోచర్లను ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లపై తన పార్లమెంట్ జోక్యం తర్వాతే TRAI ఈ చర్య తీసుకుందని అన్నారు. మరింత సరళమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికల కోసం పార్లమెంటులో తాను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *