గాన కోకిల లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆమెకు నివాళులు అర్పించారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అసమానమైన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా నిలిచి పోతుందని ఆయన పేర్కొన్నారు. మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు . 2022 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. “పూజ్యురాలైన లతా దీదీకి ఆమె జయంతి సందర్భంగా హృదయ పూర్వక నివాళులు. తన అద్భుతమైన గాన ప్రతిభతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తిని ఇనుమడింప జేశారని పేర్కొన్నారు మోదీ.

తన మధురమైన స్వరంతో భారతదేశాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా, దేశ శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఆమె నిరంతరం ప్రోత్సహించార‌ని గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అసమానమైన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా నిలిచి పోతుందని ప్రధాని అన్నారు. ఇక ల‌తా మంగేష్క‌ర్ త‌న జీవ‌త కాలంలో పెళ్లి చేసుకోలేదు. వేలాది పాట‌లు పాడారు. ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గీతాల‌ను ఆలాపించారు. భార‌త దేశంలోని అన్ని భాష‌ల‌లో త‌న‌దైన ముద్ర వేశారు.

  • Related Posts

    గులాబీ సైనికుల్లో జోష్ నింపిన ది ప్యార‌డైజ్

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. ఇందులో కీ రోల్స్ పోషించారు న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్, కయాదు లోహ‌ర్. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. మిశ్ర‌మ…

    రాజ‌మౌళి వార‌ణాసి వాల్కానో లాంటి మూవీ

    హైద‌రాబాద్ : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను తీసిన వార‌ణాసి మూవీ అగ్ని ప‌ర్వ‌తం లాంటిద‌న్నాడు. ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా జోనస్ ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *