యవత్మాల్ సహకార బ్యాంకులో ఈడీ సోదాలు

ముంబై : స్థానిక సహకార బ్యాంకులో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. బాబాజీ డేటే మహిళా సహకార బ్యాంకు అధికారులు, ఉద్యోగులు రుణగ్రహీతలపై యవత్మాల్‌లోని అవధూత్‌వాడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్ (FIR)ల ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడింది . ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేంద్ర సంస్థ కేసు నమోదు చేసిన తర్వాత చేపట్టిన ఈ సోదాల్లో సుమారు తొమ్మిది ప్రాంతాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

మోసం , డిపాజిటర్ల డబ్బును దుర్వినియోగం చేసినట్లు వచ్చిన అనేక ఫిర్యాదుల ఆధారంగా 2022లో RBI ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక ఆడిట్‌లో బ్యాంకు సీఈఓ, చైర్‌పర్సన్, డైరెక్టర్లు ,ఇతర అధికారులు, రుణగ్రహీతలు, వాల్యూయర్లు (విలువ నిర్ధారకులు), ఆడిటర్లతో కుమ్మక్కై, సరైన హామీ లేకుండా మరియు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయకుండానే రుణాలు మంజూరు చేసినట్లు తేలిందన్నారు. రుణ లబ్ధిదారులతో కుమ్మక్కై చైర్‌పర్సన్ , బ్యాంకు అధికారులు రూ. 242 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

  • Related Posts

    లబ్ధిదారుల గుర్తింపు గడువు పెంపు : స‌విత

    అమరావతి : రెండో విడత నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు…

    బీసీ కోటా పున‌రుద్ద‌ర‌ణ కోసం కోర్టుకు వెళ‌తాం

    అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా బీసీల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది రాష్ట్ర హైకోర్టు. దీనిపై గురువారం స్పందించారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *