న‌టుడు ప్రియ‌ద‌ర్శిని ప్ర‌శంసించిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్ తో తీశాడు. స్టార్టింగ్ నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఈ మూవీ రూ 200 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది. సినీ ఇండ‌స్ట్రీ విస్తు పోయేలా చేసింది. తాజాగా ఈ మూవీలో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర‌ను పోషించాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఆయ‌న న‌టించిన ఈ పాత్ర‌కు ఫుల్ బ‌జ్ వ‌చ్చింది. సినిమా స‌క్సెస్ లో కూడా కీల‌క భూమిక వ‌హించింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పాత్ర‌కు న్యాయం చేసిన ప్రియ‌ద‌ర్శిని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు. ఇదిలా ఉండ‌గా న‌టుడు ప్రియదర్శి హరీష్ రావు నివాసంలో గురువారం క‌లిశారు. తన సినీ ప్రయాణం , రాబోయే చిత్రాల గురించి చర్చించారు.

చంద్రశేఖర్ రావు హావభావాలు, నడక , మాట తీరును ప్రియదర్శి ఎంతో సహజంగా, ప్రభావవంతంగా ,ఆకట్టుకునేలా పోషించారని ఆయన కొనియాడారు. అస్తిత్వం ,ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటాల స్ఫూర్తిని ఈ చిత్రం సమర్థవంతంగా ఆవిష్కరించిందని హ‌రీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు న‌టుడు ప్రియదర్శి, ఆయన చేస్తున్న ప్రజా సేవ, ప్రజలతో ఆయనకున్న అనుబంధం పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. వారి సంభాషణలో, ‘మల్లేశం’, ‘బలగం’ వంటి చిత్రాల ద్వారా తెలంగాణ యాసను , గ్రామీణ నేపథ్య కథలను విస్తృత ప్రేక్షకులకు చేరవేసినందుకు హరీష్ రావు ప్రియదర్శిని అభినందించారు. సినీ నేపథ్యం లేకుండానే ఎదిగి రావడం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో ఆయన చేస్తున్న కృషి రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు.

  • Related Posts

    రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో శ్రీలీల..?

    చెన్నై : ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల వార్త‌ల్లో నిలిచారు. తాజాగా త‌ను త‌లైవా న‌టిస్తున్న మూవీలో భాగం కానున్నారు. ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రాబోయే తమిళ చిత్రం ‘ధర్మన్’లో శ్రీలీల భాగం…

    ‘ది ట్రైటర్స్’ రియాల్టీ షోకు హోస్ట్ గా తేజ స‌జ్జ‌

    హైద‌రాబాద్ : ప్రైమ్ వీడియో తమ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ (The Traitors Telugu) ప్రపంచ ప్రీమియర్‌ను ప్రకటించింది. నమ్మకం, మోసం, వ్యూహం , ద్రోహం వంటి అంశాల కలయికతో సాగే ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *