ప్ర‌తి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భ‌రోసా ఇస్తున్నాం

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెలా 1వ తేదీనే అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గడచిన 28 నెలలుగా ప్రతినెలా మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నానని అన్నారు. 1వ తేదీన అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల సేవలో ఉంటున్నారని పేర్కొన్నారు. చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యాన్ అని నేను విశ్వసిస్తాన‌ని అన్నారు సీఎం. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పని చేస్తున్నానని చెప్పారు. పేదలకు న్యాయం చేయాలన్న బాధ్యతతో మేం పని చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రతి నెలా నాలుగు మార్లు ప్రజల ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతి నెలా 1 తేదీన పేదలకు ఆర్ధిక భద్రత కల్పించే పెన్షన్ల కార్యక్రమం, 9 తేదీన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నాం అన్నారు .

గత పాలకులు సృష్టించిన భూ వివాదాలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు. ఇక ప్రతిమూడో శనివారం పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి , 4 శనివారం సంజీవని కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పారు సీఎం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని నిత్యం ప్రజా సేవకులుగా పని చేస్తున్నాం అన్నారు. గడచిన రెండేళ్లుగా ప్రతీ వ్యక్తికి, ప్రతీ కుటుంబానికి సాధికారిత తీసుకు వస్తున్నాం అని తెలిపారు. రాష్ట్రంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. .గొడ్డలి పార్టీ నేతలు ప్రజలు కొట్టిన దెబ్బకు అలిగి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గత పాలకులు అన్ని వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారని అన్నారు.

  • Related Posts

    యవత్మాల్ సహకార బ్యాంకులో ఈడీ సోదాలు

    ముంబై : స్థానిక సహకార బ్యాంకులో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. బాబాజీ డేటే మహిళా సహకార…

    రేపే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం : సీఎం

    చెన్నై : గాంధీ జ‌యంతి అక్టోబర్ 2న మహిళలకు విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం విజయ్. అధికార పార్టీ అయిన ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ముడిపడి ఉన్న ‘వెట్రి పయనం’ (విజయవంతమైన ప్రయాణం) అనే ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *