హైదరాబాద్ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది. రేపిస్టులకు భయం పుట్టించేలా ఈ తీర్పు వెలువరించింది. మీరు అత్యాచారం చేస్తే, మిమ్మల్ని చంపేస్తాం అనే భయాన్ని కలిగించేలా సుప్రీంకోర్టు వ్యవహరించనుంది. ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంపై నెటిజన్లు స్పష్టత కోరుతున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
అత్యాచారం చేయాలనే ఆలోచన కూడా రాకుండా పురుషుల మనసుల్లో భయాన్ని కలిగించాలని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లైంగిక నేరాలకు పాల్పడే వారిని కచ్చితంగా చంపేస్తారనే భయాన్ని సృష్టించడంపై కోర్టు నొక్కి చెప్పింది. రాత్రి వేళల్లో మహిళలు రోడ్లపై నిర్భయంగా నడిచే పరిస్థితిని కల్పించాలని ఆదేశించింది. ఇదే సమయంలో, బీజేపీ ఎంపీ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు విషయంలో నిర్ణయం వెల్లడించాలని నెటిజన్లు వ్యంగ్య ధోరణిలో డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. దీనిపై బీజేపీ, హిందూ సంఘాలు, నేతలు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.





